ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jogi Ramesh: జోగి రమేష్ అక్రమాలపై షాకింగ్ విషయాలు చెప్పిన ఏసీబీ

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:54 PM

అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్‌లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...

అమరావతి : అగ్రిగోల్డ్ స్కామ్ (Agri Gold Scam) గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను (Jogi Rajeev) అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్‌లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. గొల్లపూడి ఏసీబీ ఆఫీస్‌కు తరలించిన అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.


లెక్కలతో సహా..!

అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయి. ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశాం. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్‌ను కూడా మార్చారు. ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమని తేలాయి. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నాం. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. మా విచారణ లో పిసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. అందుకే మా విచారణ వేరుగా సాగిస్తున్నాం. సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తాం. మా దర్యాప్తులో ఐదుగురి పేర్లు ఉన్నాయి. విచారణలో మరికొన్ని పేర్లు ఉండొచ్చు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుంది. నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తాం. 87 సర్వేలో ఎలాంటి సబ్ డివిజన్‌లు జరగలేదు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశాం. 88 సర్వేలో స్థలం కొని.. 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్‌లను అరెస్టు చేశాం. ఈరోజు వారిద్దరినీ కోర్టులో హాజరు పరుస్తాంఅని సౌమ్యలత చెప్పుకొచ్చారు.


మాకూ టైమ్ వస్తుంది..!

ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై జోగి రమేష్ మీడియాతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం. మావాడు విదేశాల్లో చదువుకుని ఇక్కడికి వచ్చాడు. సీఎం నారా చంద్రబాబు రాజకీయాలకు మా వాడిని బలి చేస్తున్నారు. మీకు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనేది గుర్తు ఉంచుకోండి. ఇక్కడితో అయిపోదు..‌ మాకు కూడా సమయం వస్తుంది. చంద్రబాబు అక్రమ కేసులతో వేధిస్తే భయపడం. ఆనాడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ వాళ్లు బూతులు తిట్టారు. ఆ అంశాలను చంద్రబాబుకు వివరించడానికే వాళ్ల ఇంటికి వెళ్లాను. దానిని దాడిగా చిత్రీకరించి నన్ను అడ్డుకున్నారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది.. మావాడి‌ పాత్ర లేదని రుజువు అవుతుంది’ అని జోగి రమేష్ చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 13 , 2024 | 04:05 PM

Advertising
Advertising
<