ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్రప్రదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చింది

ABN, Publish Date - Oct 01 , 2024 | 04:55 AM

‘వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. కష్టాలు పడ్డారు. నిజం గెలవాలని నేనూ ప్రజల్లోకి వెళ్లాను.

  • ప్రజల ముఖాల్లో సంతోషం చూస్తున్నాను

  • లడ్డూ కల్తీ వ్యవహారం బాధ కలిగించింది: నారా భువనేశ్వరి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. కష్టాలు పడ్డారు. నిజం గెలవాలని నేనూ ప్రజల్లోకి వెళ్లాను. చివరకు నిజం గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ప్రజల తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నాను. అది ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె సోమవారం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 4వ బ్లడ్‌ బ్యాంక్‌ను, మొబైల్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

‘రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టువులా ఆదరించారు. 53 రోజుల పాటు నన్ను, నా కోడలు బ్రాహ్మణిని అందరూ ఆదరించారు. ఎప్పుడూ మర్చిపోలేను. అందరికీ పాదాభివందనాలు. చంద్రబాబు నా భర్తగానే కాకుండా ఒక లీడరుగానూ ముందుండాలని కోరుకుంటాను. ప్రజలు ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయనే ముందుంటారు. నేనెప్పుడూ ఆయనను వెనక్కిలాగను. అందరూ బాగుండాలి. చేనేత వర్గాల కష్టాలు చూశారు. వారిని ప్రోత్సహించాలి. వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం ఓ భక్తురాలిగా నన్ను బాధపెట్టింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పేదల కోసం అన్న క్యాంటీన్లు ఎప్పుడూ ఉండాలి. బ్రాహ్మణికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఇష్టమూ కాదు. కానీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల్లో ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తారు’ అని భువనేశ్వరి వివరించారు.


  • రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 4వ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌లో టీడీపీ హెల్త్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గోరంట్ల రవిరామ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న గోరంట్ల శాంతారావు ఫౌండేషన్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 4వ బ్లడ్‌ బ్యాంక్‌ను సోమవారం భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం అంబులెన్స్‌ను, కోలమూరులో ఎన్టీఆర్‌ మొబైల్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జీఎ్‌సఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ గోరంట్ల రవిరామ్‌ కిరణ్‌, మేనేజింగ్‌ ట్రస్టీ గోరంట్ల వెంకటలక్ష్మి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 05:46 AM