ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : ‘మత్తు’ వదలాల్సిందే

ABN, Publish Date - Nov 28 , 2024 | 02:58 AM

ఎవరు గంజాయి సాగు చేసినా... సరఫరా చేస్తూ పట్టుబడినా.. మత్తు పదార్థాలు విక్రయించినా కటకటాలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ దూరం కావాల్సిందే! ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన కూటమి సర్కారు... దీనిపై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

  • గంజాయి సాగు, రవాణా, విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్‌

  • 450 మంది పోలీసులతో ప్రత్యేక దళం

  • ఆరు నెలల్లో గంజాయిని తరమడమే లక్ష్యం

  • సాగు-రవాణా మార్గాలపై నిరంతర నిఘా

  • ‘1972’కు సమాచారం ఇస్తే పారితోషికాలు

  • విద్యా సంస్థల్లో ‘ఈగల్‌’ కమిటీలు

  • గ్రామ స్థాయిలోనూ కమిటీలకు బాధ్యతలు

  • అన్ని శాఖలతో కలిపి సమన్వయం

  • ‘మహా సంకల్పం’ పేరుతో భారీ సదస్సులు

  • మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయాలు

6 నెలల్లో రాష్ట్రం నుంచి గంజాయిని తరిమేయడమే లక్ష్యం! ఇందుకు అన్ని మార్గాలను అన్వేషించాలి. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కదలాలి. గంజాయి సాగు చేసే నేల నుంచి అది చేరే గమ్యం దాకా... ప్రతి దశలో నిఘా పెట్టాలి.

- మంత్రివర్గ ఉప సంఘం

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎవరు గంజాయి సాగు చేసినా... సరఫరా చేస్తూ పట్టుబడినా.. మత్తు పదార్థాలు విక్రయించినా కటకటాలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ దూరం కావాల్సిందే! ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన కూటమి సర్కారు... దీనిపై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అన్ని వర్గాలను ఇందులో భాగస్వాముల్ని చేసి ‘ఈగల్‌’ ద్వారా మత్తు మహమ్మారిని శాశ్వతంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంది. వైసీపీ హయాంలో ‘దేశ గంజాయి రాజధాని’గా రాష్ట్రంపై పడిన ముద్రను తొలగించే దిశగా కఠిన చర్యలు చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో గంజాయిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రులు లోకేశ్‌ (విద్య), సత్యకుమార్‌ (వైద్య), గుమ్మిడి సంధ్యారాణి (గిరిజన సంక్షేమ), కొల్లు రవీంద్ర(ఎక్సైజ్‌)లతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మన్యంలో గంజాయి సాగు నుంచి బయట వినియోగం వరకూ చర్చించిన మంత్రులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా... గంజాయి సాగు, సరఫరా, విక్రయంలో పాల్గొనే వారిపై కేసులు పెట్టడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించారు.


  • ‘ఈగల్‌’ కన్ను...

గడచిన ఐదు నెలల్లో ఉత్తరాంధ్ర పోలీసులు గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలను హోం మంత్రి అనిత వివరించారు. అతి త్వరలో కార్యాచరణ ప్రారంభించబోతున్న యాంటీ నార్కోటిక్‌ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ‘ఈగల్‌’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. 450మందికి పైగా వివిధ స్థాయి పోలీసులు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో గంజాయి, మత్తు పదార్థాల కట్టడికి రంగంలోకి దిగబోతున్నట్లు చెప్పారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై సమాచారం ఇచ్చేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1972ను అందుబాటులోకి తెస్తామన్నారు. కచ్చితమైన సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని... తగిన పారితోషికం కూడా ఇస్తామని చెప్పారు. గంజాయి సాగు నుంచి గమ్యం చేరేవరకూ రవాణాదారులు ఉపయోగించే మార్గాలపై పూర్తి నిఘా పెడతామని... దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, డ్రోన్లనూ వాడతామని చెప్పారు. జీపీఎస్‌, ఆర్‌ఎ్‌ఫఐడీ, ట్రాకింగ్‌ సిస్టమ్‌, ఏఐ ఆధారిత సీసీ కెమెరాల నిఘా, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌, ప్రొఫైలింగ్‌, సోషల్‌ మీడియా మానిటరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి కట్టడి చేస్తామన్నారు.


  • ఆ మాటే వినిపించొద్దు...

అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంలో గంజాయి మాటే వినిపించకుండా ఉండాలంటే మత్తు మహమ్మారి జోలికి వెళ్లే వారికి సంక్షేమ పథకాలు రద్దు చేయడం సరైనదని మంత్రి లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు గంజాయి బారిన పడుతున్న నేపథ్యంలో... విద్యా సంస్థల్లో పదిమందితో ‘ఈగల్‌’ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులతో పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల పరిధిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయి నియంత్రణలో ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, గ్రామ కమిటీల సేవలనూ ఉపయోగించుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ‘మహా సంకల్పం’ పేరుతో భారీ అవగాహన సదస్సులు నిర్వహించాలని, రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రం నుంచి గంజాయిని తరిమేసే మార్గ్గాలన్నింటిపై దృష్టి సారించాలని తీర్మానించింది.

పోలీసు, సాధారణ పరిపాలన, వైద్య, అటవీశాఖ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పురపాలక, విద్య, రవాణా, యువజన, గిరిజన, ఎక్సైజ్‌ శాఖల సహకారంతో గంజాయి, మత్తును తుదముట్టించాలని నిర్ణయం తీసుకుంది. గంజాయికి బానిసలైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా 52చోట్ల డీఅడిక్షన్‌ కేంద్రాలు (ఆసుపత్రులు, జైళ్లలో) అందుబాటులోకి తేవాలని తీర్మానించింది. సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, యాంటీ నార్కొటిక్స్‌ విభాగం చీఫ్‌ ఆకే రవికృష్ణ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 03:04 AM