ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:39 PM

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ex MLA Kodali Nani

గుడివాడ, జూన్ 13: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునేత్ర

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కానీ 2009 ఎన్నికల అనంతరం కొడాలి నాని.. టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు.

Also Read: ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు... పోలీసులను ఆశ్రయించిన డాక్టర్


ఇక 2014, 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ఎమ్మెల్యేగా కొడాలి నాని విజయం సాధించారు. 2019లో జగన్ ప్రభుత్వం కొలువు తీరడంతో.. ఆయన కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి కొడాలి నాని వ్యవహార శైలీలో తీవ్ర మార్పు వచ్చింది. అనంతరం 2022 ఏప్రిల్‌లో వైయస్ జగన్ తన కేబినెట్ పున్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి నుంచి కొడాలి నానిని తొలగించారు.

Also Read: Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అయినా ఆయన వ్యవహార శైలీలో వీసమెత్తు మార్పు మాత్రం రాలేదు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ ఓటరు.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు పట్టం కట్టాడు. దీంతో కొడాలి తాజాగా మాజీ అయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌‌లో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. అదే రోజు కొడాలి నాని భద్రత సిబ్బందిని తొలగించడం రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 10:39 AM

Advertising
Advertising