AP High Court : సీసీఐ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:15 AM
రాష్ట్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
గుంటూరు సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన బి.అశోక్, సీసీఐ మాజీ మేనేజర్ గోగినేని సాయి ఆదిత్య కమల్ దేవ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ నెల 16న తీర్పు వెలువరించారు. సీసీఐ కేంద్రాలుగా నోటిఫై చేసిన జిన్నింగ్ కాటన్ మిల్లుల్లో సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా మోసం జరగకుండా ఉండడం మాత్రమే కాకుండా, అవినీతికి కూడా ఆస్కారం ఉండదన్న పిటీషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
Updated Date - Dec 21 , 2024 | 04:15 AM