ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swiggy: స్విగ్గీకి షాక్.. 14వ తేదీ నుంచి బ్యాన్..

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:37 PM

Swiggy: స్విగ్గీకి హోటల్స్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చింది. స్విగ్గీని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించింది. తమను ఇబ్బందులకు గురి చేస్తోందని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని హోటల్స్ నిర్వాహకులు ప్రకటించారు.

Banned Swiggy

అమరావతి, అక్టోబర్ 04: స్విగ్గీకి బిగ్ షాక్ ఇచ్చారు హోటల్స్ యజమానులు. స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. మరి స్విగ్గీపై హోటల్స్ యాజమాన్యం ఎందుకంత కోపంగా ఉంది.. ఎందుకు ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంది.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్న హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. స్విగ్గీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌.వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు చెప్పారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని హోటల్స్‌లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో కారణంగా హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27వ తేదీన ముడు దఫాలుగా స్వీగ్గీ, జుమాటో ప్రతినిధులతో చర్చించామన్నారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని చెప్పారు. స్వీగ్గీ మాత్రం కాలయాపన చేస్తూ వస్తోందన్నారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. స్విగ్గీపై బ్యాన్ విధించినట్లు ప్రకటించారు. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అనివార్య కారణాల వల్ల ఈనెల 14 వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకటించారు.


Also Read:

తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

సుప్రీం తీర్పుపై కేంద్రమంత్రి స్పందన

జగన్ ఏం చర్చించారు..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 04 , 2024 | 05:52 PM