AP Politics: సొంత ఇలాఖాలో మంత్రి బుగ్గనకు నిరసన సెగ
ABN, Publish Date - Jan 31 , 2024 | 12:01 PM
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గం డోన్‌లో నిరసన సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ డోన్ ఇంచార్జీ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ‘టీడీపీ రైతు కరువు కేక’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళనలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి (Buggana Rajendranath Reddy) సొంత నియోజకవర్గం డోన్‌లో నిరసన సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ డోన్ ఇంచార్జీ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ‘టీడీపీ రైతు కరువు కేక’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళనలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. డోన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ తీశారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊరు బేతంచెర్లను కరువు మండలంగా ఎంపిక చేశారు. డోన్, ప్యాపిలీను విస్మరించారు. ఆ రెండింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 31 , 2024 | 12:01 PM