ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదానీ ఒప్పందాలపై.. అన్ని కోణాల్లో చర్చించాక చర్యలు

ABN, Publish Date - Nov 29 , 2024 | 04:41 AM

‘రాష్ట్రంలో అదానీతో విద్యుత్‌ ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ఆర్థిక, న్యాయపరంగా అన్ని కోణాల్లో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయం: పయ్యావుల

అనంతపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో అదానీతో విద్యుత్‌ ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ఆర్థిక, న్యాయపరంగా అన్ని కోణాల్లో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. పీఏసీ చైర్మన్‌గా వైసీపీ పాలనలో ఈ ఒప్పందాలపై మాట్లాడానని, కోర్టుకు వెళ్లానని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని.. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పకూలేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. పలు రకాల పనులకు చెల్లించాల్సిన మొత్తం ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. చేసిన అప్పులు, వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. అభివృద్ధి కోసం అప్పులు చేయడం తప్పుకాదు. కానీ చేసిన అప్పులను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి.. తర్వాత వచ్చే ఆదాయాన్ని పేదల సంక్షేమానికి ఉపయోగించాలి. చేసిన అప్పులను అధిగమించేందుకు చాలా కాలం పడుతుంది. చంద్రబాబు బ్రాండ్‌తోనే ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాగుతున్నాం.

కేంద్ర ప్రభుత్వంతో సీఎం సమన్వయం చేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ ఏ విధంగా అవసరమవుతుందో ఆ తరహాలో రాష్ర్టాన్ని నడిపించగలుగుతున్నాం. గత ఏడాది రాష్ట్ర ఆదాయంలో 99 శాతం వేతనాలు, పింఛన్లకే ఖర్చు చేశారు. అంతకు ముందు ఏడాది ఈ వ్యయం 107 శాతం ఉంది. అస్తవ్యస్త విధానాలతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు తయారుచేసి అమలు చేస్తున్నాం. యువతకు మంచి భవిష్యత్‌ అందించేందుకు ముందుకెళ్తున్నాం. పరిశ్రమలు తీసుకురావడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ఆ ఫలాలను ప్రజలకు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నాం’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 04:42 AM