రేపటి నుంచి ఎంఎస్ఎంఈల సర్వే
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:57 AM
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) సర్వే శుక్రవారం నుంచి ప్రారం భం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు ఈ సర్వే కొనసాగుతుంది.
సచివాలయాల ఉద్యోగులకు బాధ్యత
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) సర్వే శుక్రవారం నుంచి ప్రారం భం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఏపీ ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కోసం ‘ఎంఎ్‌సఎంఈ సర్వే అండ్ సపోర్ట్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ డెవల్‌పమెంట్ కమిషనర్ల ద్వారా జిల్లా పరిశ్రమల కేంద్రాలు, జిల్లా కలెక్టర్లు సర్వే పురోగతిని పర్యవేక్షిస్తారు. జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు సమన్వయంతో పని చేసి ఈ సర్వేని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఇండస్ట్రియల్ పార్కులను ఈ సర్వే పరిధిలోకి తీసుకురానున్నారు.
సర్వే లక్ష్యాలు..
రాష్ట్రంలోని అన్ని ఎంఎ్‌సఎంఈల డేటాబేస్ అభివృద్ధి.
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై
అవగాహన.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తల నైపుణ్యాల అభివృద్ధి, ఇతర సేవలు.
నమోదు వల్ల వివిధ రకాల ప్రోత్సహకాలు పొందేందుకు అర్హత.
‘ర్యాంప్’ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని ఎంఎ్‌సఎంఈలకు అవగాహన కల్పించి, వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు.
రాష్ట్రంలో బిజినెస్ డెవల్‌పమెంట్ సర్వీస్ (బీడీఎస్) ప్రొవైడర్స్‌ను తయారు చేయడం.
Updated Date - Nov 28 , 2024 | 04:58 AM