Anganwadi Strike: 30 నెంబర్ ఆకారంలో కూర్చుని అంగన్వాడీల సమ్మె
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:08 PM
Andhrapradesh: రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

విజయవాడ, జనవరి 10: రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. మరోవైపు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎస్మా ప్రయోగాలేవీ అంగన్వాడీలని కదపలేవని వారు స్పష్టం చేశారు. వినూత్నంగా 30వ నెంబర్ ఆకారంలో కూర్చొని తమ డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు.
మరోవైపు సమ్మె చేస్తున్న అంగన్వాడీల ఇంటి అడ్రస్‌లను సూపర్వైజర్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి అడ్రస్ చెప్పేందుకు అంగన్వాడీలు నిరాకరిస్తున్నారు. అంగన్వాడీల సెంట్రల్ వద్దకు వెళ్లాలని.. ఇంటి అడ్రస్‌లు చెప్పమని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..