ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anganwadis: అంగన్వాడీలకు జులైలో జీతాలు పెంపు.. సమ్మె విరమణ

ABN, Publish Date - Jan 23 , 2024 | 07:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజుల నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ (Anganwadis) సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజుల నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేశారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సోమవారం (నిన్న) సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అంగన్‌వాడీలను డ్యూటీ నుంచి తొలగిస్తున్నామని సర్క్యులర్ కూడా జారీ చేసింది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణతో అంగన్‌వాడీ ప్రతినిధులు జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. బుధవారం నుంచి విధుల్లో చేరతామని అంగన్‌వాడీలు ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని అంగన్‌వాడీ ప్రతినిధులు మీడియాకు వివరించారు. ‘తమ వేతనాలను జులైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. చర్చల్లో జరిగిన అంశాలను రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. గ్రాట్యూటీ ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట ఇచ్చింది. అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.1.2 లక్షలు, హెల్పర్‌కు రూ.60 వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. మట్టి ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. పరిహారంగా రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించింది. టీఏ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. ఇప్పటినుంచి నెలకు టీఏ బిల్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందు వల్లే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వివరించింది. 42 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది అని’ అంగన్‌వాడీ వర్కర్ యూనియన్ ప్రతినిధి సుబ్బరావమ్మ మీడియాకు వివరించారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడంతో అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటన చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 01:11 PM

Advertising
Advertising