ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:13 PM

గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు.

విజయవాడ: గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆపై చంద్రబాబు దంపతులు సైతం టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5 లకే ఆహారాన్ని అందిస్తారు.


అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది? అని పేద ప్రజల్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రూ.5 లకే కడుపు నింపే అన్న క్యాంటీన్లు పున: ప్రారంభం మహోన్నత కార్యక్రమానికి నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళం అందించారు. అందుకు సంబంధించిన చెక్‌ను మున్సిపల్ శాఖ మంత్రి పీ.నారాయణకు అందజేశారు. కోటి రూపాయల విరాళం అందించిన వారి పేరు మీద ఒక రోజు ఆహారం అందిస్తామని ఇంతకు ముందు మంత్రి నారాయణ పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లోని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం త్వరలోనే అమలు చేస్తామని నారాయణ తెలిపారు. కాగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ రోజు ప్రారంభమయ్యాయి.

Updated Date - Aug 15 , 2024 | 01:27 PM

Advertising
Advertising
<