AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి రంగం సిద్దం
ABN, Publish Date - Nov 10 , 2024 | 07:51 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షన జరిగినే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అందుకు ముందు సభలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు.
అమరావతి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.
Also Read: Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..
అయితే రేపు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఈ సమావేశాల్లో ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. నాలుగు నెలల క్రితం కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. అయితే గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి నవంబర్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
Also Read: విమాన ప్రయాణికులకు శుభవార్త..!
మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబోమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై తాము విమర్శలు చేస్తామని తెలిపారు. అది కూడా తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచే ఈ విమర్శలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Also Read: PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్
అదీకాక తమకు ప్రతిపక్ష హోదా కేటాయిస్తే.. అసెంబ్లీలో మైక్ అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భావనలా ఉందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకానున్నారు.
Also Read: CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి
ఇంకోవైపు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీకి కేవలం ఈ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. అంటే ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు.
Also Read: జున్ను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అలాంటి వేళ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ .. అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. సంఖ్యా బలం లేకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూదరదని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు.
For Andhrapradesh News And Telugu News
Updated Date - Nov 10 , 2024 | 07:51 PM