ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : బిల్డింగ్‌ రూల్స్‌పై అభ్యంతరాల స్వీకరణ

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:56 AM

ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌-2017 కింద ప్రతిపాదించిన ముసాయిదా సవరణల పై అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  • వారంలోగా డీటీసీపీకి సమర్పించాలి

  • గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌-2017 కింద ప్రతిపాదించిన ముసాయిదా సవరణల పై అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలను 7రోజుల్లోగా మంగళగిరిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌కు లేదా పురపరిపాలన, పట్టణాభివృద్ధిశాఖకు పంపాలని సూచించింది. ముసాయిదా సవరణలు ఇలా...

రక్షణ సంస్థలకు, రైల్వే ఆస్తులకు ఆనుకుని ఉన్న స్థలాల విషయంలో ఆయా విభాగాల అధికారుల నుంచి ఎన్‌వోసీ అవసరం లేదు. అయితే అధికారులు సూచించిన నియమాలను దరఖాస్తుదారులు అనుసరించాలి.

బేస్‌మెంట్లు 500 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్లాట్లకు మాత్రమే అనుమతిస్తారు.

అగ్నిమాపక సేవా నిబంధనలకు లోబడి అనుమతించిన అంతస్థుల్లో మార్పులు లేకుండా భవనం ఎత్తును గరిష్ఠంగా 2మీ. వరకు మార్చుకోవచ్చు. అప్రోచ్‌ రోడ్డులో వంపులు, మలుపులు ఉంటే అగ్నిమాపక వాహనాలు తిరగడానికి వీలుగా టర్నింగ్‌ సర్కిల్‌ కనీసం 9.0 మీటర్ల వ్యాసార్థం ఉండాలి. గ్రౌండ్‌ లెవల్‌/ రోడ్డు లెవల్‌ నుంచి భవనం ఎత్తు 18 మీటర్లు దాటినప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ పొందాలి.

పోడియం పార్కింగ్‌కు సంబంధించి పోడియం ఫ్లోర్‌ గరిష్ఠ ఎత్తు 15 మీటర్లు ఉండాలి. స్థలం విస్తీర్ణం 10 ఎకరాల కంటే ఎక్కువుంటే సింగిల్‌ పోడియం అనుమతించరు. పోడియం అంతస్థుల కోసం ఆల్‌రౌండ్‌ సెట్‌బ్యాక్‌లు ఉండాలి. అప్రోచ్‌ రోడ్డు వెడల్పు ఆధారంగా భవనం ఎత్తు ఉండాలి.

Updated Date - Dec 22 , 2024 | 05:56 AM