ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nadendla Manohar: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన

ABN, Publish Date - Nov 28 , 2024 | 03:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీంతో రైతులు తమ ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర కలత చెందుతుంది.అలాంటి వేళ.. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పామర్రు, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

గుడివాడ, నవంబర్ 28: రైతు సమస్యలను పరిష్కరిస్తూ.. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు. గురువారం గుడివాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ... శుక్రవారం సాయంత్రం లోపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులెవరు ఆందోళన చందలవలసిన అవసరం లేదని వారికి మంత్రి భరోసా ఇచ్చారు.

Rains: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ


వాతావరణ మార్పుల కారణంగా 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ... నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగం అంతా రేయింబవళ్లు కష్టపడుతుందని చెప్పారు. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ధాన్యం విక్రయాలపై.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.


రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.


రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. శుక్రవారం సాయంత్రానికి గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని వివరించారు. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు సైతం విడుదల చేశామన్నారు. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించామని చెప్పారు.


రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనే సంచెలు.. రవాణా వాహనాలు పంపించేలా ఏర్పాటు చేశామని వివరించారు. అయితే దళారులను ప్రోత్సహించ వద్దంటూ ఈ సందర్భంగా రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అంతకుముందు... పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రహదారులపై ఆరబోసిన ధాన్యపు రాశులను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందలు లేకుండా.. ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఈ సందర్బంగా మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.


రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం సులభతరం చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ధాన్యం కొనుగోలు కోసం.. రైతులు తమ సమయాన్ని వృధా కాకుండా వాట్సప్ ద్వారా సేవల అందించేందుకు కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా 73373-59375 నెంబర్‌కు వాట్సప్‌లో హై అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవలు అందుబాటులోకి వస్తాయని రైతులుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం విధితమే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 03:57 PM