ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan-Karthi: కార్తీ సారీ.. స్పందించిన పవన్ కల్యాణ్..

ABN, Publish Date - Sep 24 , 2024 | 09:11 PM

తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు కార్తీ సారీ చెబుతూ చేసిన ట్వీట్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కార్తీని అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు. సంప్రదాయాల పట్ల కార్తీ చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు..

AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 24: తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు కార్తీ సారీ చెబుతూ చేసిన ట్వీట్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కార్తీని అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు. సంప్రదాయాల పట్ల కార్తీ చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు.. కార్తీ నటించిన సత్యంసుందరం సినిమా విజయవంతం కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


పవన్ కల్యాణ్ ట్వీట్ సారాంశం..

‘ప్రియమైన కార్తీ గారూ.. సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, అలాగే మీ వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి, తిరుమలలోని గౌరవప్రదమైన లడ్డూతో పాటు.. మన పవిత్ర దేవాలయాలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల్లో లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలపై జాగ్రత్తగా స్పందించటం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మీ పరిస్థితి కూడా అనుకోకుండా అలా ఉందని నేను అర్థం చేసుకున్నాను. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత, ఐక్యత, గౌరవాన్ని పెంపొందించడం. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి.. మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల గురించి. సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం, ప్రతిభ కలిగి ఉన్న గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను. మీకు, సూర్యా గారూ, జ్యోతిక గారూ, టీమ్ మొత్తానికి నా అభినందనలు. సత్యంసుందరం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.’ అని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కార్తి లడ్డూ విషయం సెన్సిటివ్‌ అని, ఇప్పుడు ఆ విషయం మనకొద్దని యాంకర్‌కు సమాధానం ఇచ్చారు. దీనిపై మంగళవారం ఉదయం పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ‘కుదిరితే మద్దతు పలకండి.. కానీ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయొద్దు’ అంటూ కార్తీకి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో కార్తీ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ సర్‌ మీకు నా క్షమాపణలు అంటూ ట్వీట్‌ చేశారు కార్తీ.


‘పవన్‌కల్యాన్‌ సర్‌ మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నేనూ వేంకటేశ్వరస్వామికి భక్తుడినే. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’ అని కార్తీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 09:12 PM