ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:52 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసం.. మరొకటి వెలుగులోకి..

Also Read: మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి అనంతరం ఇప్పటికే పవన్ ఓసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన విషయం విధితమే. ఇక ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సైతం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్‌లు ఉన్నారు. ఇక పార్లమెంట్ భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. పవన్‌ను కలిశారు.

Also Read: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ

Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక

Also Read: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్


పవన్ కల్యాణ్ మూడో రోజు ఢిల్లీ పర్యటన నేడు కొనసాగుతుంది. ఇక పవన్ కల్యాణ... తన పర్యటనలో భాగంగా మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన అంశాలు చర్చించారు. అలాగే ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌తో సైతం పవన్ భేటీ అయ్యారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 01:04 PM