ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IT Raids: ఐటీ రైడ్స్.. వైసీపీ నేత ఇంట్లో రూ. 1.5 కోట్లు స్వాధీనం?

ABN, Publish Date - May 09 , 2024 | 09:45 AM

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు(ap elections 2024) కొద్ది రోజుల ముందే ఆదాయపన్ను శాఖ దాడులు(ir raids) కలకలం రేపుతున్నాయి. దీంతో పలువురు కీలక నేతలతోపాటు బడా వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత గంగాధర్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

IT raids YCP leader Gangadhara house

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు(ap elections 2024) కొద్ది రోజుల ముందే ఆదాయపన్ను శాఖ దాడులు(ir raids) కలకలం రేపుతున్నాయి. దీంతో పలువురు కీలక నేతలతోపాటు బడా వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తమ ఇళ్లపై దాడులు చేస్తారని భయం భయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత గంగాధర్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఐటీ అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


ఇక ఎన్నికల వేళ ఏపీలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో తెలంగాణ(telangana)లో ఉన్న పలువురు నేతలు, వ్యాపారులు కూడా భయాందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఎన్నికల వేళ ఐటీ అధికారులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు సోదాలు చేసి పెద్ద ఎత్తున నగదును పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉన్నందున అధికారులు మరికొంత మంది నేతలు, వ్యాపారుల ఇళ్లల్లో రైడ్స్ చేసే అవకాశం ఉంది.


ఇప్పటివరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు(lok sabha election 2024) సంబంధించిన మూడు దశల ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. నాల్గవ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్‌లో ఈ రౌండ్‌లో మొత్తం 1710 మంది అభ్యర్థులు ఉండగా 1540 మంది పురుషులు, 170 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 25, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, తెలంగాణలో 17, యూపీలో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్మూ కాశ్మీర్‌లో ఒక సీటు ఉన్నాయి. నాలుగో దశ పోలింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు కూడా ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.


ఇవి కూడా చదవండి..

CM Jagan: నేడు కర్నూలుకు సీఎం జగన్ రాక..


Andhra Pradesh : ‘హోం ఓటింగ్‌’ వద్ద వైసీపీ రచ్చరచ్చ

Read more AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:49 AM

Advertising
Advertising