ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cash Seized: ఎన్నికల వేళ రూ.8 కోట్లకుపైగా పట్టుబడిన నగదు

ABN, Publish Date - May 09 , 2024 | 08:00 AM

ఏపీలో ఎన్నికల(ap elections 2024) ఓటింగ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును(cash) పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్‌, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు.

ap elections 2024 Over Rs 8 Crore cash seized

ఏపీలో ఎన్నికల(ap elections 2024) ఓటింగ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును(cash) పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సిటివ్‌గా గుర్తించిన నియోజక వర్గాలు సహా అనేక ప్రాంతాలలో పోలీసులు(police) నిఘాను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్‌, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు.


ఆ క్రమంలో అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ గరికపాడు వద్ద తెలంగాణ(telangana) రాష్ట్రం నుంచి లారీలో తరలిస్తున్న 8 కోట్లు రూపాయలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు పెద్ద ఎత్తున లభించడంతో వాటిని లెక్కించేందుకు పోలీసులు కౌంటింగ్ మెషీన్‌లు తెప్పించి లెక్కించారు. అయితే పోలీసులకు ముందుగానే పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు ఈ నగదును పట్టుకున్నారు. అయితే ఈ క్యాష్ ఎవరిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం తెలియలేదు.


ఈ నేపథ్యంలో ఏపీ(ap)లో పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ మరింత నిఘా పెంచామని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత క్యాష్ పట్టుబడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరికొంత మంది నేతలు పలు ప్రాంతాల్లో ల్యాప్‌టాప్‌లు, చీరలు, కుక్కర్లు సహా ఇతర ఉచిత వస్తువుల పంపిణీ చేస్తుండగా దొరికిందని అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

CM Jagan: నేడు కర్నూలుకు సీఎం జగన్ రాక..


Andhra Pradesh : ‘హోం ఓటింగ్‌’ వద్ద వైసీపీ రచ్చరచ్చ

Read more AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 08:02 AM

Advertising
Advertising