AP : గోదావరి వరద తగ్గుముఖం
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:19 AM
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కులు ప్రవాహం వెళుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాండ్ లెవల్ 13.26 మీటర్లుగా ఉంది.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులు
సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కుల వరద.. పోలవరం స్పిల్‌వే నుంచి 6.70 లక్షల క్యూసెక్కులు విడుదల
సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కుల వరద ప్రవాహం
పోలవరం స్పిల్‌వే నుంచి 6.70లక్షల క్యూసెక్కులు విడుదల
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/పోలవరం, ఆగస్టు 3: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కులు ప్రవాహం వెళుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాండ్ లెవల్ 13.26 మీటర్లుగా ఉంది. గోదావరి డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు పంపిస్తున్నారు.
భద్రాచలం వద్ద తెల్లవారుజామున 3 గంటలకు 33 అడుగులకు తగ్గిన వరద తర్వాత క్రమంగా సాయంత్రం 5 గంటలకు 33.90 అడుగులకు చేరింది. ఇది పెద్దగా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎగువన వర్షాలు లేవని, పొలాల్లోనూ, వాగుల నుంచి వచ్చే వరద కొద్దిగా పెరిగి, తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. గోదావరిలో లంకలు తేలిపోతున్నాయి.
భద్రాచలంలో ఇక పెరుగుదల లేకపోతే, ఆదివారం సాయంత్రానికి చాలా నీరు లాగేస్తుంది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుతో కలసి శనివారం ఎర్రకాలువ వరదతో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఎర్రకాలువ ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం అంచనాలు తయారుచేయాలని ఎంపీ ఆదేశించారు.
కాగా, ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 6,70,355 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 31.050 మీటర్లు, దిగువన 22.240 మీటర్ల నీటి మట్టం నమోదైందని అధికారులు తెలిపారు.
Updated Date - Aug 04 , 2024 | 04:19 AM