AP Govt: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర
ABN, Publish Date - Dec 16 , 2024 | 09:48 AM
పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పాపికొండల యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బోటు యజమానులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్ట్ ను సోమవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పాపికొండల యాత్రను నిలిపివేశారు. ఈ అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరంలో స్పందించారు. పాపికొండల యాత్ర యాథావిధిగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ టూర్ బుక్ చేసుకున్న యాత్రికులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారని ఆయన స్పష్టం చేశారు.
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
అయితే పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం చంద్రబాబు సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆదివారం నుంచి పర్యాటక బోట్లను ఆపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పర్యాటకుల నుంచే కాదు.. ఇటు బోటు యజమానుల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇదే విషయం మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సైతం స్పందించింది. పర్యాటక బోట్లను యాథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిబంధనలు పాటించే పర్యాటక బోట్లకు అనుమతి ఇస్తున్నట్లు అల్లూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు.
Also Read: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
సీఎం చంద్రబాబు నాయుడు.. సోమవారం ఉదయం 11.00 గంటలకు పోలవరం రానున్నారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు పోలవరం నుంచి సెక్రటేరియట్ కు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం సీఎం చంద్రబాబు రెండోసారి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 27వ తేదీన సీఎం చంద్రబాబు సందర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 16 , 2024 | 09:48 AM