ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government: పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు

ABN, Publish Date - Jul 16 , 2024 | 11:09 AM

పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కొత్త పరిశ్రమల కోసం చంద్రబాబు సర్కార్ కసరత్తు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

అమరావతి: పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం (AP Government) ప్రణాళికలు రచిస్తోంది. కొత్త పరిశ్రమల కోసం చంద్రబాబు సర్కార్ కసరత్తు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అశోక్ లేలాండ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తోంది. మల్లవల్లి పారిశ్రామిక వాడలో త్వరలో అశోక్ లేలాండ్ కార్యకలాపాలు నిర్వహించనుంది.


గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగి రానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ నిలవనుంది. అశోక్ లేలాండ్ సహా 10 కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంప్రదింపులు జరిపారు. మల్లవల్లిలో త్వరలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ ఆచి మసాలా సంస్థ సిద్ధమవుతోంది. విస్తరణ దిశగా హెచ్‌సీఎల్ కంపెనీ ఆలోచన చేస్తోంది. విశాఖ, బందరు, తిరుపతి, అనంత జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో కంపెనీలను తెచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విశాఖలో సాఫ్ట్ వేర్, అనంత, తిరుపతి కేంద్రంగా హార్డ్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, బందరులో బీపీసీఎస్ కంపెనీల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. సీఆర్డీఏలోకి వివిధ సంస్థలను తిరిగి రప్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం

ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం

For AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:09 AM

Advertising
Advertising
<