ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ap Govt : మూడేళ్లలో నవ రాజధాని

ABN, Publish Date - Dec 17 , 2024 | 03:22 AM

రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని మూడు నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి, ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తిచేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు.

  • వచ్చే నెలలో రాజధాని పనులు

  • వారంలో టెండర్లు.. నెలాఖరులోగా ఖరారు

  • మొత్తం రూ.62 వేల కోట్ల అంచనా వ్యయం

  • తాజాగా రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం

  • సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం

  • మూడేళ్లలో ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి: నారాయణ

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని మూడు నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి, ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తిచేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. మిగిలినవి జనవరిలో పూర్తి చేసి, అదే నెల నుంచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. మూడేళ్లలో రాజధాని అమరావతిని ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాజధానిలో ఐకానిక్‌ భవనాలు, ట్రంక్‌ రోడ్లు, లేఅవుట్లకి సంబంధించి రూ.24,276.83కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గత నాలుగు సమావేశాల్లో మొత్తం రూ.45,249.24 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం లభించినట్లు తెలిపారు. రాజధానిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళిక రూపొందించాలని సీఎం చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

  • 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ..

103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఏడాదిలో 60రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే.. మిగతా రోజుల్లో అసెంబ్లీ భవనంపై నుంచి సందర్శకులు రాజధానిని తిలకించే అవకాశం కల్పిస్తామన్నారు. రూ.1,048 కోట్లతో హైకోర్టు భవనాన్ని 42.3 ఎకరాల్లో 20.32లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 అంతస్థులుగా నిర్మిస్తామని చెప్పారు.


సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) భవనాలను 17.03 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. హెడ్‌వోడీ భవనాలతో కలిపి, 47 అంతస్తులతో మొత్తం 5 టవర్లతో కూడిన భవనాలు 68.88 లక్షల చదరపు అడుగుల్లో రూ.4,688 కోట్లతో నిర్మిస్తామన్నారు.ఎల్పీఎ్‌సలో మౌలిక సదుపాయాల్లో భాగంగా నాలుగు ప్రధాన రహదార్లు, ఇతర రోడ్లు, విద్యుత్‌ లైన్లు, తాగునీటి పైపులైన్లు, ఇతర కేబుల్‌, ఫుట్‌పాత్‌ల వంటి సౌకర్యాలకు రూ.9,699 కోట్లు, 306.93 కి.మీ. ట్రంక్‌ రోడ్లలో 151.9 కి.మీ. రోడ్లకు రూ.7,794.56 కోట్లు, ఎస్టీపీ పనులకు రూ.318.15 కోట్లకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. మొత్తం రాజధాని నిర్మాణ వ్యయం అంచనా రూ.62వేల కోట్లు కాగా, ఇప్పటికి రూ.45,249.24 కోట్లకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మిగతా వాటికి కూడా అథారిటీ ఆమోదం తెలుపుతుందన్నారు. ఈ మొత్తం పనులకు వచ్చే మంత్రివర్గ సమావేశంలో పెట్టనున్నట్లు తెలిపారు. 29 రాజధాని గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి లభించే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంలో అడ్డంకులను రైతులతో చర్చించి, పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్లు మేర డిజైన్‌ చేసి, సింగపూర్‌ కన్సెల్టెన్సీతో లేఅవుట్లు ప్లాన్‌ చేశామన్నారు.

  • వైసీపీ నేతలకు బురదజల్లడమే తెలుసు

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురదజల్లుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయం పెంచామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బురదజల్లే నేతలంతా ఎస్‌వోఆర్‌ రేట్లను పరిశీలన చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మూడు ముక్కల ఆటతో నిర్మాణ వ్యయం అనేక రెట్లు పెరిగిపోయిందన్నారు. గత ఐదేళ్లూ రాజధాని పనులను కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వ భవనాలన్నింటికీ కలిపితే 49.02%, ఐకానిక్‌ టవర్స్‌కు 41%, ఫ్లడ్‌ కెనాల్స్‌ పనులకు 39%, హైకోర్టు భవనాలకు 28% రేట్లు పెరిగాయని చెప్పారు.

Updated Date - Dec 17 , 2024 | 03:23 AM