AP High Court : షరతులతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:26 AM
సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మకు....
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనకాపల్లి జిల్లా రావికమతం, గుంటూరు జిల్లా తుళ్లూరు, ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ హౌజ్ ఆఫీసర్(ఎ్‌సహెచ్‌వో)లకు రూ. 10 వేల చొప్పున రెండు స్వీయ పూచీకత్తులు సమర్పించాలని ఆర్జీవీని ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ మంగళవారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెల్లడించిన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆర్జీవీ సహకరించడం లేదని, పోలీసుల నోటీసులకు స్పందించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ముందస్తు బెయిల్ రద్దు కోసం తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
Updated Date - Dec 11 , 2024 | 05:29 AM