ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : జోగి రాజీవ్‌, సర్వేయర్‌ రమేశ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలి

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:41 AM

అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయించారనే ఆరోపణపై నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్‌, మండల సర్వేయర్‌ అజ్మీరా రమేశ్‌లను కస్టడీకి అప్పిగించేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏసీబీ అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

  • వారి నుంచి కీలక సమాచారం రాబట్టాలి

  • ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయండి

  • హైకోర్టులో ఏసీబీ అధికారుల పిటిషన్‌

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయించారనే ఆరోపణపై నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్‌, మండల సర్వేయర్‌ అజ్మీరా రమేశ్‌లను కస్టడీకి అప్పిగించేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏసీబీ అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని, వారిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ వాదనలు ఏసీబీ కోర్టు పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిని కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న జోగి రాజీవ్‌, సర్వేయర్‌ అజ్మీరా రమేశ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఉమ్మడి కృష్ణా జిల్లా, అంబాపురం గ్రామం పరిధిలోని 2,160 చదరపు గజాల సీఐడీ జప్తుచేసిన అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయించారనే ఆరోపణలతో జోగి రమేశ్‌ కుటుంబ సభ్యులు, మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో జోగి రాజీవ్‌, అజ్మీరా రమేశ్‌కు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

  • వారి బెయిళ్లు రద్దు చేయండి..

మరోవైపు ఇదే కేసులో జోగి రాజీవ్‌, అజ్మీరా రమేశ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్‌ను విచారణ నిమిత్తం తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Sep 13 , 2024 | 03:41 AM

Advertising
Advertising