ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాక్‌పోలింగ్‌ కాదు.. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:22 AM

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తాము కోరినట్లుగా ఈవీఎం, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనకు బదులుగా మాక్‌ పోలింగ్‌ మాత్రమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ...

  • హైకోర్టును ఆశ్రయించిన బాలినేని

  • మాక్‌ పోలింగ్‌ నిలిపివేయాలని వినతి

  • స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

  • వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశం

  • విచారణ నేటికి వాయిదా

  • మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను బహిష్కరించిన వైసీపీ

అమరావతి/ఒంగోలు(కార్పొరేషన్‌), ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తాము కోరినట్లుగా ఈవీఎం, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనకు బదులుగా మాక్‌ పోలింగ్‌ మాత్రమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సోమవారం చేపట్టిన మాక్‌ పోలింగ్‌ను ఆపాలన్న బాలినేని తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ అంశంపై బాలినేని తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు విషయంలో ఏమైనా అభ్యంతరం ఉంటే... ఈవీఎం, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనకు వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ... ఎన్నికల కమిషన్‌ ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చింది.

పిటిషనర్‌ అభ్యంతరం లేవనెత్తిన పోలింగ్‌ స్టేషన్లలో వినియోగించిన ఈవీఎంలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని తెలిపింది. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌) సోమవారం మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దీనిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’’ అని కోరారు.

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... ఈసీఐ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంటే సర్వోన్నత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చుకదా అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని బాలినేని తరఫు న్యాయవాది కోరారు. ఈసీ వివరాలు సమర్పించిన అనంతరం ఈ విషయం పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటిస్తూ న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.


  • ‘మాక్‌ పోలింగ్‌’ బహిష్కరణ

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఒంగోలులోని 12 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పోలింగ్‌ రోజున వాడిన ఈవీఎంలతో మాక్‌పోలింగ్‌ నిర్వహించేందుకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణ అధికారిగా నియమితులైన వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ ఝాన్సీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు.

వైసీపీ, టీడీపీ అభ్యర్థుల తరఫు ప్రతినిధులు, ఈవీఎం కంపెనీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సీసీ కెమెరా నిఘాలో ప్రక్రియను చేపట్టారు. అయితే... తాము కోరింది వేరు, అధికారులు చేస్తున్నది వేరని వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తారు.

మాక్‌ పోలింగ్‌కు తాము అంగీకరించేది లేదని, ఈవీఎంలలో డేటాను అలాగే ఉంచి, వీవీప్యాట్‌ స్లిప్‌లు మొత్తం లెక్కించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. అయితే దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మాక్‌ పోలింగ్‌ మాత్రమే చేపడతామని తేల్చిచెప్పారు. కానీ... సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అన్ని ఓట్లు లెక్కించాలని వైసీపీ వారు డిమాండ్‌ చేశారు.

అయితే ఎన్నికల నిబంధనల మేరకు... ఈవీఎంలు సక్రమంగా పని చేస్తున్నాయని రుజువు చేసేందుకు ‘మాక్‌ పోలింగ్‌’ మాత్రమే నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అధికారులు కూడా ఈ ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు సీల్‌ వేసి, యథావిధిగా భద్రపరిచారు. ఒంగోలు నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్ల రీవెరిఫికేషన్‌పై వైసీపీ అభ్యర్థి డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 05:22 AM

Advertising
Advertising
<