ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం

ABN, Publish Date - Nov 22 , 2024 | 04:05 PM

రాష్ట్రంలోని క్రీడాకారులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో 2 నుంచి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతున్నట్లు ఏపీ క్రీడల శాఖ మంత్రి ఎమ్. రాం ప్రసాద్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.

AP SPorts Minister M. Ram Prasad

అమరావతి, నవంబర్ 22: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్‌తో గ్లోబల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారబోతుందని రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎమ్. రాం ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. శాప్‌లో గ్రేడ్ -3 కోచ్‌ల కోసం అంతర్జాతీయంగా పతకాలు సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Also Read: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే


పారా స్పోర్ట్స్‌తో పాటు చెవిటి, అంధులకు క్రీడలను సైతం ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వీరికి యాప్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. అలాగే ఇకపై క్రీడా దినోత్సవం సందర్భంగా.. క్రీడాకారులకు స్వర్ణాంధ్ర క్రీడా బిరుదులు ప్రదానం చేస్తామని తెలిపారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు.


రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజాన్ని సైతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ క్రీడ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. పీపీపీ భాగస్వామ్యంతో క్రీడా రంగానికి మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో రాష్ట్రంలోని 85 లక్షల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతామని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


మరోవైపు రాయచోటిలోని ఆసుపత్రిలో ఐసీయూ సామర్థ్యం సరిపోదని.. క్రిటికల్ కేర్ బ్లాక్‌ (CCB) ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. అందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకోసం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని మంత్రి సత్య కుమార్ హామీ ఇచ్చారు. దీంతో రాయచోటిలోని క్రిటికల్ కేర్ బ్లాక్‌లో క్లిష్టమైన కేసులకు చికిత్స అందించే నిర్మాణానికి పునాది పడినట్లయింది.

For Andhra Pradesh News And Telugu News

Updated Date - Nov 22 , 2024 | 04:08 PM