Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..
ABN, Publish Date - Nov 10 , 2024 | 06:54 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ట్విట్ అంతా అబద్దాల పుట్టగా ఆయన అభివర్ణించారు.
అమరావతి, నవంబర్ 10: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ అంతా అబద్దాల పుట్ట అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం అమరావతిలో అభివర్ణించారు. గతంలో చేసిన తప్పులకు సంబంధించి ఆ పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవడం మానేసి.. ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ మునిగిపోతుందన్నారు. దోపిడీ దారుడే.. వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేస్తాడని ఆయన పేర్కొన్నారు.
Also Read: విమాన ప్రయాణికులకు శుభవార్త..!
2004లో వైఎస్ జగన్‌కు రూ.2 కోట్ల లోపు ఆస్తి ఉండేదని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ జగన్‌కు నేడు లక్షల కోట్ల రూపాయిల ఆస్తి ఎలా వచ్చిందని పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మితిమీరిన దోపిడి చేశాడని సీబీఐ.. తన ఛార్జీషీట్‌లో స్పష్టం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చట్ట బద్ద వ్యాపారం, పరిపాలన చేసే సీఎం చంద్రబాబుకు వ్యవస్థీకృత నేర రాజకీయాల చేసే అవసరం లేదని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Also Read: PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్
ఉచ్చనీచాలు మరచి మహిళల శీలహననం చేసే అపర దుశ్శాసనుల భరతం పట్టడం వ్యవస్థీకృత నేరమా? అని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను పల్లా శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. తన దుష్ట లక్షణాల్ని ఎదుటి వారికి అంటగట్టి.. చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పడం వైఎస్ జగన్ నైజమని ఆయన పేర్కొన్నారు. జగన్ ట్వీట్‌లో ఉన్నదంతా నేరాల సమర్థనేనన్నారు. పరనింద తప్ప ఆత్మ విమర్శ చేసుకోవడం.. వైఎస్ జగన్‌లో ఏ మాత్రం లేదని చెప్పారు. ఆత్మ విమర్శ మరచి అబద్దాలతో ఎదురు దాడి చేసే నేతల రాజకీయ భవిత కనుమరుగు అవుతుందన్నది చారిత్రక సత్యమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి
ఇంతకీ ఏం జరిగింది..
గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత వంగలపూడి అనితతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారు. అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సైతం తీవ్ర అభ్యంతరకర పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టింగులు చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read: జున్ను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అయితే గతంలో జగన్ ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా.. ఈ వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా మళ్లీ రెచ్చిపోయింది. అలాంటి వేళ.. కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.
అయితే ఈ అరెస్టులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ క్రమంలో ఈ అరెస్ట్‌లపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ఖండించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావుపై విధంగా స్పందించారు.
For Andhrapradeshl News And Telugu News
Updated Date - Nov 10 , 2024 | 07:13 PM