ఏపీఐడీసీ చైర్మన్‌గా డేగల బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Nov 26 , 2024 | 05:10 AM
ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు చిరునామాగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని, ప్రతీ ఇంటిలో...
గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు చిరునామాగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని, ప్రతీ ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనే సీఎం చంద్రబాబు లక్ష్య సాధన కోసం పనిచేస్తానని ఏపీ ఇండస్ర్టియల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) చైర్మన్ డేగల ప్రభాకరరావు అన్నారు. తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో సోమవారం అయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Updated Date - Nov 26 , 2024 | 05:10 AM