Big Breaking: ఈనెల 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ బంద్
ABN, Publish Date - Mar 12 , 2024 | 02:55 PM
Andhrapradesh: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆసుపత్రుల ట్రస్ట్ యాజమాన్య కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రులు యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తు్న్నట్లు ట్రస్ట్ యాజమాన్య కమిటీ ప్రకటించింది.
అమరావతి, మార్చి 12: ఏపీలో (Andhrapradesh) ఆరోగ్య శ్రీ (Arogya Sri) సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి (AP Government) ఆసుపత్రుల ట్రస్ట్ యాజమాన్య కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రులు యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ యాజమాన్య కమిటీ ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని యాజామాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి చెప్పినా వినలేదని.. ఇంకా ప్రభుత్వం నుంచి 850 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయని ఆస్పత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి...
Haryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ
AP HighCourt: మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైకోర్ట్‌లో రిలీఫ్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 12 , 2024 | 04:12 PM