ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchennaidu: బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట..

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:14 PM

వైవీ నోట.. జగన్ రెడ్డి మాట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారన్నారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడన్నారు.

అమరావతి: వైవీ నోట.. జగన్ రెడ్డి మాట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారన్నారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడన్నారు. అందుకే ఇప్పటి వరకూ విశాఖ రాజధాని అని.. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెరలేపారన్నారు. గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలని అన్నాడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని.. అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించాడని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అమరాతిని నాశనం చేశాడని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధిని దూరం చేశాడని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

రైతుల త్యాగాన్ని హేళన చేసి బూటు కాళ్లతో హింసించాడని పేర్కొన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడని అచ్చెన్నాయుడు అన్నారు. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడన్నారు. మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్కను జగన్ తెరపైకి తీసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడన్నారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి ఏంటనేది ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూస్తే అర్ధమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తామని.. అమరావతిని పూర్తి చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని.. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 01:14 PM

Advertising
Advertising