ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodali Nani: కొడాలి నానికి బిగ్ షాక్..

ABN, Publish Date - Jun 21 , 2024 | 07:15 AM

మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ వార్డు వలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు. ఇప్పుడిది వారి మెడకే చుట్టుకుంటుంది. ముందుగా వార్డు వలంటీర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను అడ్డదారిలో నడిపిద్దామని చూశారు. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని పక్కాగా స్కెచ్ వేశారు. దీనిని అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు.

గుడివాడ: మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ వార్డు వలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు. ఇప్పుడిది వారి మెడకే చుట్టుకుంటుంది. ముందుగా వార్డు వలంటీర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను అడ్డదారిలో నడిపిద్దామని చూశారు. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని పక్కాగా స్కెచ్ వేశారు. దీనిని అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు. వార్డు వలంటీర్లపై కేసులు నమోదవడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా పెన్షన్ ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


ఈ క్రమంలోనే అప్పటి విపక్షాలకు ఝలక్ ఇద్దామన్నట్టుగా పలువురు వైసీపీ నేతలు వార్డు వలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారు. వారిలో కొడాలి నాని కూడా ఒకరు. ఫలితంగా విపక్షాలకు నష్టమేమీ జరుగలేదు కానీ రాజీనామా చేసిన వారంతా తీవ్రంగా నష్టపోయారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447,506,R/w34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 21 , 2024 | 07:15 AM

Advertising
Advertising