MLA Nallamilli Ramakrishna Reddy : అక్రమాలు చేసేందుకు గన్ కన్నా జగనే ముందొచ్చారు
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:29 AM
రాష్ట్రంలో ఎక్కడికైనా గన్ కన్నా జగనే ముందు వస్తారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి ఎద్దేవా
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడికైనా గన్ కన్నా జగనే ముందు వస్తారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూకబ్జాలు, అక్రమాలు చేయడానికి, పారిశ్రామిక వేత్తల ఆస్తులు లాక్కోవడానికి గన్ కన్నా ముందే జగన్ ముందే వచ్చి బెదిరిస్తారన్న విషయం బట్టబయలు అవుతోందన్నారు. కాకినాడ పోర్టు యజమానికి బెదిరింపులు, వైసీపీ భూ కబ్జాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అనంతరం ‘వారధి’ కార్యక్రమంలో పార్టీ నాయకుడు ఆర్డీ విల్సన్, నాగోతు రమేశ్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Updated Date - Dec 06 , 2024 | 04:30 AM