Bonda Uma: లైవ్‌లోనే ఎంపీ కేశినేని లెక్కలు తీసిన బోండా ఉమ!
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:52 PM
వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు.
అమరావతి: వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసేశారని బోండా ఉమ విమర్శించారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటేనన్నారు. అతి పెద్ద బ్యాంక్ స్కామర్ కేశినేని నాని అని ఆరోపించారు. బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారన్నారు. ఆయన పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయని బోండా ఉమ విమర్శించారు.
నానికి టికెట్ ఇప్పించడంలో సుజన పాత్ర..
కేశినేని నాని అప్పుల అప్పారావు.. బిల్డప్ బాబాయ్.. ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని నాని టీడీపీలో చేరి ఎంపీ టిక్కెట్ తీసుకున్నారని బోండా ఉమ విమర్శించారు. ప్రజల కోసం.. పార్టీ కోసం పని చేస్తానంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారన్నారు. కేశినేని నానికి టిక్కెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర కూడా ఉందన్నారు.2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేశినేని నాని తరపున సుజనానే డబ్బు ఖర్చు పెట్టారని.. చంద్రబాబు దయతో గెలిచారన్నారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని టిక్కెట్ తెచ్చుకున్నారన్నారు. 2019 ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ రావడానికి కారణం లోకేష్ అని పేర్కొన్నారు. రెండు సార్లు పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని బోండా ఉమ విమర్శించారు.
100 శాతం మేర పెరిగిన ఆస్తులు..
2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ.37 కోట్లు.. అప్పులు రూ.66 కోట్లు అని బోండా ఉమ పేర్కొన్నారు. అలాగే 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ.66 కోట్లు.. అప్పులు రూ.51 కోట్లు అని వివరించారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100 శాతం మేర పెరిగాయన్నారు. కేశినేని నాని వల్ల పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొందన్నారు. ప్రస్తుతం వైసీపీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి కేశినేని నాని దిగజారిపోయాడని బోండా ఉమ విమర్శించారు. వైసీపీలో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ లేదని... కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకుని.. సంస్థ పేరు మార్చేశాడన్నారు.
జగన్ దొడ్డిలో మొరిగే కుక్కలా కేశినేని..
ప్రస్తుతం జగన్ దొడ్డిలో మొరిగే కుక్కలా ఉన్న కేశినేని నాని.. పిచ్చి కుక్కలా మారి జగన్ మీదకు వెళ్లడం ఖాయమని బోండా ఉమ విమర్శించారు. కేశినేని నానికి రూ.2 వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. ఊళ్లో వాళ్ల ఆస్తులను కూడా తన ఖాతాలో వేసుకుని చెబుతున్నారా..? అని నిలదీశారు. చంద్రబాబును కేశినేని నాని విమర్శిస్తే తిరగనివ్వబోమని హెచ్చరించారు. కేశినేని నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. జగన్ ఇంట్లో బూట్లు తుడుస్తారో.. బాత్రూంలు కడుగుతారో మాకు అనవసరమని బోండా ఉమ తెలిపారు.
Updated Date - Feb 13 , 2024 | 01:01 PM