ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: బొత్సకు జీ హుజూర్‌!

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:28 AM

ప్రభుత్వం మారిందన్న మాటేకానీ వైసీపీ నేతల హవా తిరుమలపై ఏమాత్రం తగ్గడం లేదు.

  • తిరుమల దర్శనాల్లో రెడ్‌కార్పెట్‌

  • కూటమి ప్రభుత్వంలోనూ అదే దర్జా

  • బొత్స సిఫారసుపై ఒకేరోజు 26 మందికి దర్శనం

  • మంత్రి చెప్పినా.. రోజుకు 12 మందికే అనుమతి

  • మాజీ మంత్రి సిఫారసుపై అంత మందికి ఎలా?

  • పాత పరిచయాలతో కీలక అధికారి నిర్వాకం

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారిందన్న మాటేకానీ వైసీపీ నేతల హవా తిరుమలపై ఏమాత్రం తగ్గడం లేదు. నిబంధనల ప్రకారం మంత్రి సిఫారసు లేఖ ఇచ్చినా 12 మందికి మించి దర్శనాలకు అనుమతించని చోట.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సిఫారసు లేఖపై 26 మందికి ఒకేరోజు టీటీడీ దర్శనాలు చేయించడమే దీనికి నిదర్శనం. కొద్దిరోజుల కింద ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు.. తమకు తిరుమల దర్శనాల్లో అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను వారానికి ఐదు రోజులు మాత్ర మే టీటీడీ అనుమతిస్తోందని, మిగతా రెండు రోజులు లేఖలు తీసుకోవడం లేదని అధినేత దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యేల దర్శనం కోటాను పెంచాలని టీటీడీని సీఎం కోరారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇదీ.. కానీ, వైసీపీలో కీలక నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇచ్చిన సిఫారసు లేఖపై గత వారం ఏకంగా ఒకేరోజు 26 మందికి దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లింది. వారు.. దీనిపై సీఎం చంద్రబాబుకు పూర్తి వివరాలు అందించారు. టీటీడీ అధికారుల నిర్వాకం గురించి తెలుసుకున్న ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనలు పక్కన పెట్టి పదుల సంఖ్యలో టికెట్లు ఎలా జారీ చేస్తారని నిలదీశారు. ఇలాంటి సంఘటన మరోసారి జరగడానికి వీల్లేదని ఆయన టీటీడీ అధికారులకు సృష్టం చేశారు.


జరిగింది ఇదీ...

ఇప్పుడు టీటీడీలో కీలకమైన స్థానంలో ఉన్న ఓ అధికారి... బొత్స మంత్రిగా పని చేసిన సమయంలో ఆయన శాఖలో పని చేశారు. అప్పటి నుంచి ఇద్దరికీ పరిచ యం ఉంది. దీంతో బొత్స మాట కాదనలేక ఆయన కోరినంతమందికీ సదరు అధికారి దర్శనాలు జరిపించేశారు. నిజానికి, టీటీడీలోని కొంతమంది అధికారులు.. వైసీపీ నేతలతో ఉన్న పాత పరిచయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కీలకమైన శాఖల్లో బదిలీలు చేపట్టింది. అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చే సమయంలో వారికి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలతో ఏ స్థాయిలో సంబంధ బాంధ్యవాలు ఉన్నాయనేది చెక్‌ చేసుకోలేదు. దీంతో వైసీపీతో టచ్‌లో ఉన్న కొందరు అధికారులకు కీలకమైన స్థానాల్లో పోస్టింగ్‌లు లభించాయి.


Also Read:

‘మహా’ యుద్ధంలో గెలుపు ఎవరిది?

పసిడి ప్రియులకు శుభవార్త..

ఏపీని ఆపలేరు!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 23 , 2024 | 07:51 AM