CM Ramesh: శ్రీవారి దయతో ఏపీలో రాక్షస రాజ్యం పోయి.. రానున్న రామ రాజ్యం..
ABN, Publish Date - May 18 , 2024 | 01:51 PM
తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందన్నారు. చాలా కాలం తరువాత పోలీసులు వారు సక్రమంగా విధులు వారు నిర్వర్తించారన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందన్నారు. చాలా కాలం తరువాత పోలీసులు వారు సక్రమంగా విధులు వారు నిర్వర్తించారన్నారు. కొంత మంది పోలీసుల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని సీఎం రమేష్ తెలిపారు.
Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..
పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతాయని పేర్కొన్నారు. ఏపీలో పోలీసుల రాజ్యం పోయి ప్రజల రాజ్యం వచ్చిందన్నారు. కేడర్‌ని ఉత్సాహ పరచ్చేందుకే జగన్ ఐప్యాక్.. బ్లూ ప్యాక్ అంటూ మభ్యపెడుతున్నాడన్నారని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఇక ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ సంతోష్ కుమార్, ఇన్ఫోసిస్ అధినేత సుధా నారాయణమూర్తి, చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..
AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..
Read more AP News and Telugu News
Updated Date - May 18 , 2024 | 01:51 PM