ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PDS Ration Scam: రేషన్ బియ్యం మాయంపై మాజీ మంత్రి భార్యపై కేసు

ABN, Publish Date - Dec 11 , 2024 | 08:56 PM

ఏపీలో ప్రస్తుతం రేషన్ బియ్యం మాఫియా చర్చనీయాంశంగా మారింది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఆఫ్రికా వంటి దేశాలకు తరలించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం విషయంలో మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

Perni Nani

ఏపీ(ap)లో రేషన్ బియ్యం అక్రమాల (PDS Ration Scam) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు తేలింది. ఈ విషయంలో ఏపీ మాజీ వైసీపీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం మాయంపై పేర్నినాని సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసు నమోదైంది. గత ప్రభుత్వ హాయంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని తెలుస్తోంది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.


బియ్యం స్టాక్ తేడా

గత పది రోజుల క్రితం జరిపిన వార్షిక తనిఖీల స్టాక్‌లో అధికారులు భారీగా బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 316(3), 316(5), 61(2) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సివిల్ సప్లయిస్ అధికారులు లోతైన విచారణ చేయాలని పోలీసులను కోరారు. రేషన్ బియ్యం మాయంపై అప్పటి అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు వారి వివరాలను ఆరా తీస్తున్నారు.


మరికొన్ని రోజుల్లో

దీనిపై స్పందించిన పేర్ని నాని తూనిక చేసే విషయంలో సరిగా చూడకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని అన్నారు. కానీ వివరణ ఇచ్చినప్పటికీ అధికారి కోటిరెడ్డి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో నాని భార్యపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ఏపీ నుంచి గత ప్రభుత్వ హాయాంలో 40 వేల కోట్ల రూపాయలకుపైగా రేషన్ బియ్యం మాఫియా జరిగిందని పలువురు నేతలు చెబుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గుంటూరు సహా పలు ప్రాంతాల్లో రేషన్ మాఫియా జరిగినట్లు తేలింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఇంకా ఏ నేతల గుట్టు బయటకు వస్తుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి...

High Court: హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు సీరియస్.. చలానా చెల్లించకుంటే వాటర్ కట్

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు

AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 09:06 PM