దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు
ABN, Publish Date - Oct 11 , 2024 | 04:38 AM
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
తిరుమల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది. టీటీడీ నియమ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించారని, సోషల్ మీడియాలో రీల్స్ కోసం వీడియోలు తీసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ శ్రీవారి ఆలయ విజిలెన్స్ ఏవీఎస్వో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 292, 296, 300 బీఎన్‌ఎ్‌స, 66(ఈ) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Updated Date - Oct 11 , 2024 | 04:38 AM