ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: కూటమి ప్రభుత్వం 100 రోజులపాలనపై ప్రముఖుల ప్రశంసలు.. ఎవరేమన్నారంటే

ABN, Publish Date - Sep 23 , 2024 | 07:58 PM

ఏపీలో వరదలను ఎదుర్కొన్నతీరు సీఎం చంద్రబాబు పాలనదక్షతకు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులపాలన సందర్భంగా సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించారు.

CM Chandrababu 100 Days Rule In AP

అమరావతి: ఏపీలో వరదలను ఎదుర్కొన్నతీరు సీఎం చంద్రబాబు పాలనదక్షతకు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులపాలన సందర్భంగా సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించారు. బాబు పాలన భవిష్యత్‌ తరాలకు, నాయకులకు ఓ విలువైన పాఠమని పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, విజన్ ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. బాబు100 రోజులపాలనపై ఎవరేమన్నారంటే..

పంచభూతాలు సహకరించాయి...

సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రకృత్తి విపత్తు ప్రభుత్వానికి సవాలు విసిరిందని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. "బాబు అనుభవదక్షతతో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆయనకు పంచ భూతాలూ సహకరించాయి. చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని కోరుకుంటున్నా"అని చాగంటి పేర్కొన్నారు.


పాలన అద్భుతం..

" సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది. ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా ఆయన చర్యలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. చంద్రబాబుని చూసి గర్వపడుతున్నా. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగిస్తున్నారు. త్వరలోనే బాబును కలుస్తా. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి నా వంతు సహకారమందిస్తా"

- సోనూ సూద్, ప్రముఖ నటుడు

కఠిన నిర్ణయాలు..

"రాష్ట్రానికి ఎలాంటి నాయకత్వం కావాలో చంద్రబాబు 100 రోజుల్లోనే చూపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో, రాష్ట్ర భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం"

- సునీతా కృష్ణన్, సామాజిక కార్యకర్త

భగవంతుడు మరింత బలానివ్వాలి..

"సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ, అనుకోని విపత్తుల్ని సమర్థంగా అధిగమిస్తూ, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఆయన కార్యదక్షతకు భగవంతుడు బలం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" - ఉదయభాను, యాంకర్


క్రీడాకారుల తరఫున శుభాకాంక్షలు..

"ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో కొనసాగుతున్నందుకు గర్వంగా భావిస్తున్నా. అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఆర్థిక కష్టాలను, విపత్తులను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోనే రాష్ట్రం విపత్తుల నుంచి బయటపడింది. సీఎంకు క్రీడాకారుల తరఫున శుభాకాంక్షలు. ప్రజలకు ఇలాంటి ప్రభుత్వమే కావాలి"

- పీవీ సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్

విజనరీ లీడర్..

"రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు, వరద విలయంలోంచి ప్రజలను బయట పడేయడంలో చంద్రబాబు విజన్, పాలన కనిపించాయి. ప్రభుత్వం విపత్తును సమర్థంగా ఎదుర్కొంది. ఆయన పాలనాదక్షత వల్లే వరద కష్టాల్లోంచి ప్రజలు త్వరగా కోలుకోగలిగారు."

- పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ శిక్షకుడు

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి..

"కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ తారాజువ్వలా దూసుకెళ్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌కు హైదరాబాద్‌ను వేదికగా నిలిపారు. ఇప్పుడు ఆయన పాలనలో క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందాలి."

- మిథాలీరాజ్, మహిళా క్రికెటర్

Monkeypox: చాపకింద నీరులా మంకీపాక్స్.. భారత్‌‌లో మూడో కేసు నమోదు

For Latest News and National News click here

Updated Date - Sep 23 , 2024 | 09:22 PM