CM Chandrababu : బీసీల స్వయం ఉపాధికి ప్రాధాన్యం
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:36 AM
బీసీ సంక్షేమ శాఖకు రూ.1,878 కోట్లు కేటాయించామని, దీనిద్వారా 1.38 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు.
1,878 కోట్లతో 1.38 లక్షల మందికి లబ్ధి
బీసీ విద్యార్థులకు డీఎస్సీ కోచింగ్: సీఎం
బీసీ సంక్షేమ శాఖకు రూ.1,878 కోట్లు కేటాయించామని, దీనిద్వారా 1.38 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. హాస్టళ్లు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు ఉన్నా.. గిరిజన ప్రాంతాల్లో ఇంకా డోలీలు మోసే పరిస్థితి ఉండటం ఇబ్బందికరమన్నారు. అంగన్వాడీల్లో మౌలిక వసతులకు నిధులు కేటాయించామని, తక్షణమే పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 46 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబు మాట్లాడుతూ రూ.143 కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు చేపడుతున్నామన్నారు. సింగిల్ విండో ద్వారా గిరిజనులకు ధ్రువపత్రాలు, రేషన్‌కార్డులు జారీ చేయాలన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 04:36 AM