ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: నేడు ఢిల్లీకి పవన్, చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలతో భేటీ..

ABN, Publish Date - Mar 07 , 2024 | 04:10 PM

Chandrababu - Pawan Kalyan Delhi Tour: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఢిల్లీ పయనమయ్యారు. గురువారం నాడు హైదరాబాద్(Hyderabad) నుంచి ఢిల్లీకి(Delhi) బయలుదేరారు చంద్రబాబు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రి ఢిల్లీలో బీజేపీ(BJP) అగ్ర నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Chandrababu Pawan Delhi Tour

Chandrababu - Pawan Kalyan Delhi Tour: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఢిల్లీ పయనమయ్యారు. గురువారం నాడు హైదరాబాద్(Hyderabad) నుంచి ఢిల్లీకి(Delhi) బయలుదేరారు చంద్రబాబు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రి ఢిల్లీలో బీజేపీ(BJP) అగ్ర నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం రాత్రి 8 గంటలలోపు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 9 గంటల తరువాత అమిత్ షా(Amit Shah), నడ్డాలతో(JP Nadda) చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. వీరి భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ గానీ.. రేపు గానీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.

మరోసారి కూటమిగా..

2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయగా.. వైసీపీ అధికారం చేపట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. పొత్తు కన్ఫామ్ అయితే.. సీట్ల కేటాయింపు అంశం కూడా తేలనుంది. ఇప్పటికే తొలిదశ అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేనలు ప్రకటించారు. రెండోజాబితాను సైతం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? అనేది తేల్చేందుకు ఇవాళ ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీకి బయలుదేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 04:10 PM

Advertising
Advertising