ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : Chandrababu మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే భారీ జరిమానా

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:38 AM

మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

  • మొదటిసారి పట్టుబడితే

  • రూ. 5 లక్షలు, రెండోసారి లైసెన్సు రద్దు

  • బెల్టు షాపుల ద్వారా అమ్మినా అదే జరిమానా

  • మద్యం అమ్మకాల్లో అక్రమాలపై కఠిన చర్యలు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మద్యం షాపుల్లో ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తూ పట్టుబడితే రూ. 5 లక్షలు జరిమానా విధిస్తారు. అదే ఉల్లంఘనకు రెండోసారి పాల్పడితే లైసెన్సు రద్దుచేస్తారు. అలాగే మద్యం షాపులో కాకుండా ఇతర ప్రదేశాల్లో బెల్టు షాపుద్వారా మద్యం అమ్మినా రూ. 5 లక్షలు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా కొనసాగిస్తే లైసెన్స్‌ రద్దుచేస్తారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల కేసుల కాకుండా ఇతరత్రా ఉల్లంఘనలకు ప్రస్తుతం అమల్లో ఉన్న జరిమానాలు కొనసాగిస్తారు. కాగా మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధించడాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2018లో ఇచ్చిన జీవో ప్రకారం మద్యం షాపుల లైసెన్సీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా మొదటిసారి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, రెండోసారి రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు జరిమానాలు విధించేవారు. మూడోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్‌ రద్దుచేస్తారు. అయితే అప్పట్లో అన్ని రకాల ఉల్లంఘనలకు ఒకే విధమైన జరిమానాలు అమలుచేశారు. ఇటీవల ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులపై ఆరోపణలు పెరిగడంతో ఈ రెండు రకాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు అమల్లోకి తీసుకొచ్చారు. అది కూడా రెండోసారి ఉల్లంఘిస్తే ఏకంగా లైసెన్స్‌ రద్దుచేస్తామనే నిబంధన తేవడంతో లైసెన్సీలు హడలిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పినంత మార్జిన్‌ తమకు రావట్లేదని గగ్గోలు పెడుతున్న లైసెన్సీలు.. ఈ భారీ జరిమానాలతో ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:38 AM