పార్టీ విరాళాల కోసం వెబ్‌సైట్ ప్రారంభించిన చంద్రబాబు
ABN, Publish Date - Apr 09 , 2024 | 06:44 PM
విరాళాల కోసం తెలుగుదేశం పార్టీ ఓ వెబ్ సైట్‌కు రూప కల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. పార్టీ విరాళాల కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. టీడీపీ ఫర్ ఆంధ్ర. కామ్ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు సేకరిస్తారని ఆయన వివరించారు.
అమరావతి, ఏప్రిల్ 09: విరాళాల కోసం తెలుగుదేశం పార్టీ ఓ వెబ్ సైట్‌కు రూప కల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. పార్టీ విరాళాల కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. టీడీపీ ఫర్ ఆంధ్ర. కామ్ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు సేకరిస్తారని ఆయన వివరించారు.
AP Elections: వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్
ఈ సందర్భంగా రూ.99,999లను ఆయన తొలి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఐటీకి ప్రాధాన్యత వచ్చిందని గుర్తు చేశారు. ఐటీకి అడ్వాన్స్‌గా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిందన్నారు. భవిష్యత్‌కు అనుగుణంగా తెలుగు జాతిని సమాయత్తం చేశామని ఆయన వివరించారు.
పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి
అయితే నేటికి జిల్లాల్లో టీడీపీకి కార్యాలయాలు లేవన్నారు. పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించేందే కానీ.. కార్యాలయాల ఏర్పాటు కోసం ఎన్నడూ ఆలోచన చేయలేదని చెప్పారు. టీడీపీ.. ప్రజల్లో ఓ భాగమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Rajiv Kumar: సీఈసీ రాజీవ్‌కుమార్‌కు 'జడ్' కేటగిరి భద్రత
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేశారు. అయితే తమ పార్టీ ఎప్పుడు కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచే విరాళాలు సేకరించిందని స్పష్టం చేశారు. కానీ అధికార వైసీపీ మాత్రం గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించిందని విమర్శించారు.
Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లికి సుప్రీం సూచన
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుమతి కోసం ఈ వైసీపీ ఎదురు చూస్తుందని ఆరోపించారు. టీడీపీకి విరాళాలు ఇవ్వడంతోపాటు రాష్ట్రానికి వచ్చి పార్టీ కోసం.. రాష్ట్రం కోసం పని చేయాలని ఎన్నారైలకు ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ తీసుకు వచ్చిన విధి విధానాల వల్ల తాము ఎలా ప్రగతి పథంలోకి వచ్చిందీ.. రాష్ట్ర ప్రజలకు వివరించాలని ఎన్నారైలకు చంద్రబాబు విజ్జప్తి చేశారు.
రూ.10 నుంచి ఎంతైనా విరాళంగా ఇవ్వ వచ్చని చెప్పారు. అయితే రాష్ట్రంలో వైయస్ జగన్ తప్ప మరెవరూ బాగుపడలేదన్నారు. ఈ జగన్ పాలనలో ప్రతి వర్గం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం వ్యతిరేక దిశలో వెళ్తుందని ఆరోపించారు.
Jawahar reddy: సీఎస్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
రాష్ట్ర విద్యా రంగంలో నాణ్యత పడి పోయిందన్నారు ప్రపంచం మొత్తం మీద ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉంటుందని గుర్తు చేశారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం పాఠశాలలకు రంగులు వేయడంలో చూపిన శ్రద్ద.. నాణ్యమైన విద్య అందివ్వడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..
Updated Date - Apr 09 , 2024 | 07:14 PM