ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: పార్టీకి ఎవరూ చెడ్డపేరు తేవొద్దు

ABN, Publish Date - Dec 20 , 2024 | 04:25 AM

పార్టీకి ఎవరూ చెడ్డపేరు తీసుకురావద్దని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నాయకులు పని చేయాలని తేల్చిచెప్పారు.

అలాంటి వారిని ఉపేక్షించం: ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ బలం కార్యకర్తలే. పార్టీని కాపాడింది వారే. వారికి న్యాయం చేసి, ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నేతలు ఈ విషయంలో చొరవ చూపాలి. గత ఐదేళ్లు విధ్వంస పాలన జరిగింది. మనం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించుకుంటూ పాలన గాడిన పెట్టాం. ఎన్డీయే ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతుంది.

- సీఎం చంద్రబాబు

జెండా మోసింది.. మోసేది కార్యకర్తలే

అధికారంలో ఉండడానికి కారణం వారే

వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు పనిచేయాలి

వారికి న్యాయం చేసి ఆదుకోవాలి

2 రాష్ట్రాల్లో 76.89 లక్షలకు చేరిన సభ్యత్వాలు

30లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి

శాశ్వత సభ్యత్వ నిధితో కార్యకర్తల సంక్షేమం

ఇప్పటికే మెజారిటీ నామినేటెడ్‌ పదవుల భర్తీ

మిగతావి కూడా త్వరలోనే చేస్తాం: సీఎం

పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌

అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పార్టీకి ఎవరూ చెడ్డపేరు తీసుకురావద్దని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నాయకులు పని చేయాలని తేల్చిచెప్పారు. పార్టీ జెండా మోసింది.. మోసేది వారేనని.. వారిని నిత్యం గౌరవించాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచి నేడు అధికారంలో ఉన్నారంటే దానికి కారణం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలేనన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ఈ నెల 30లోపు పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు. సభ్యత్వ నమోదుపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ అధ్యక్షులు, గ్రామ స్థాయి కార్యకర్తలతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందని.. సభ్యత్వ నమోదు ద్వారా ఇది నిరూపితమైందని చెప్పారు. 76 లక్షల సభ్యత్వాల నమోదుతో దేశంలో చరిత్ర సృష్టించామని.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,103 మంది సభ్యత్వం తీసుకున్నారని.. అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యులుగా చేరాలనుకుంటున్నారని చెప్పారు. ‘కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.135 కోట్లు మన కార్యకర్తలకు ఖర్చు చేశాం. రూ.100 సభ్యత్వ రుసుముతో రూ.5 లక్షల బీమా అందించే ఏకైక పార్టీ మనదే. ఇప్పటికే 685 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిఽధులను కార్యకర్తల కోసం ఖర్చు చేస్తాం. శాశ్వత సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి 71, జీడీ నెల్లూరు 38, పెదకూరపాడు 37 మందితో ముందు వరుసలో ఉన్నాయి. పారీంట సభ్యత్వం తీసుకున్న వారికి త్వరలోనే కార్డులు అందిస్తాం. వారికి వచ్చే జనవరి నుంచి బీమా అమలవుతుంది. అయినా ఇప్పటికే ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం’ అని వివరించారు.

ప్రతిభ ఆధారంగా పదవులు

మెజారిటీ నామినేటెడ్‌ పదవులను ఇప్పటికే భర్తీ చేశామని.. మిగతావి కూడా త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. అందరి అభిప్రాయాలూ తీసుకోవడంతో పాటు ప్రతిభ ప్రకారం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయుల్లో పదవులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా కూటమిదే పైచేయి. గత ప్రభుత్వం నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులను చెల్లించకుండా ఇబ్బందిపెట్టింది. కొందరి అకౌంట్లు కూడా మూసేసింది. ఈ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తాం. మన ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ విధానం తెస్తున్నాం. దీనిద్వారా నేరుగా ప్రజల సెల్‌ఫోన్‌కే సర్టిఫికెట్లు పంపిస్తాం. గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.4,500 కోట్లతో 30వేల పనులకు శ్రీకారం చుట్టాం. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే ఏడాదికి 3 గ్యాస్‌ సిలెండర్ల పథకానికి శ్రీకారం చుట్టాం. గత 6 నెలల కాలంలో అనేక సవాళ్లు, అవరోధాలు ఎదురైనా మంచి ఫలితాలు సాధించాం’ అని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Dec 20 , 2024 | 04:29 AM