ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vundavalli Aruna Kumar: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు: ఉండవల్లి అరుణ్ కుమార్

ABN, Publish Date - Feb 18 , 2024 | 12:47 PM

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. ‘‘చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ విభజన జరిగి నేటికి (ఆదివారం) పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు.

రాజమండ్రి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. ‘‘చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ అన్నారు.

ఏపీ విభజన జరిగి నేటికి (ఆదివారం) పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. జగన్ అఫిడవిట్ వేశారని, అయితే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎవరూ హాజరుకావటం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ‘‘ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంట్‌పై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలి. పదేళ్లు పూర్తయిన విభజన హామీ చట్టం అమలు చేయడం లేదు’’ అని అన్నారు.

ఏపీ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బందం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం జగన్ ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Feb 18 , 2024 | 12:48 PM

Advertising
Advertising