Chandrababu: తాగునీటి సమస్యపై చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే
ABN, Publish Date - Apr 10 , 2024 | 06:18 PM
సీఎం జగన్(CM Jagan) అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితులు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) విమర్శించారు. ఏపీలో నీటికొరతకు సంబంధించి ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమరావతి: సీఎం జగన్(CM Jagan) అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితులు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) విమర్శించారు. ఏపీలో నీటికొరతకు సంబంధించి ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు
"రైతులకు సాగునీరు లేదు. ప్రజలకు తాగునీరు లేదు. సీమలోని పల్లెల నుంచి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కరెంటు బిల్లులు కట్టక కొన్ని, నిర్వహణ లేక కొన్ని... ఇలా తాగునీటి పథకాలన్నీ మూలనపడ్డాయి.
ట్యాంకర్లతో మంచినీటి సరఫరా అన్నది ఎప్పుడో అటకెక్కింది. ఈ వేసవి ఎలా గడుస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి పాలకుడి దగ్గర ప్రణాళికే లేదు. ఒక అసమర్థ ప్రభుత్వం వ్యవస్థలను ఎలా నాశనం చేస్తుందో, దానివల్ల ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలపై కాకుండా ఇప్పటికైనా ప్రజల తాగునీటి కష్టాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి" అని బాబు హితవు పలికారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 10 , 2024 | 06:18 PM