CM Chandrababu: ప్రజావేదిక నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు అమరావతి పర్యటన
ABN, Publish Date - Jun 20 , 2024 | 07:44 AM
అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు.
అమరావతి: అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతం, నిలిచిపోయిన ఐఏఎస్‌లు, మంత్రులు, న్యాయమూర్తుల భవనాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలన విధ్వంసాలతోనే కొనసాగింది. ప్రజా వేదిక కూల్చివేతతో తన పాలనను ఆయన ప్రారంభించారు. రాజధాని నిర్మాణాలను నిలిపివేసి.. భవనాలను పడవుబెట్టారు. 70, 80 శాతం నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి.. మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి.. నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు.
Updated Date - Jun 20 , 2024 | 07:44 AM