ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఛత్తీస్‌ టు ఆంధ్రా!

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:35 AM

అది ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన బియ్యం ఎగుమతి కంపెనీ. పేరంతా అక్కడే అయినా వ్యాపారం కాకినాడలోనే. ఇక్కడినుంచే ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న ఈ కంపెనీ, ఆ ముసుగులో రేషన్‌బియ్యాన్ని భారీగా సముద్రాలు దాటించేస్తోంది.

ఇదేం ‘రేషన్‌’ లింకు బాబోయ్‌

ఛత్తీ్‌సగఢ్‌ కంపెనీ సత్యం బాలాజీ లీలలెన్నో

పోర్టు నుంచి అత్యధిక బియ్యం ఎగుమతి దానిదే

ఛత్తీ్‌స నుంచి ధాన్యం తెచ్చి.. ఆడించి మిక్స్‌ చేస్తున్నారా?

లేదంటే కాకినాడ కేంద్రంగానే సేకరించి తరలిస్తున్నారా?

జూన్‌లో కంపెనీ గోదాములో పెద్దఎత్తున తనిఖీలు

6,332 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం.. కేసు

మళ్లీ నౌకలోకి ఎక్కిస్తున్న 1,320 టన్నులు పట్టివేత

ఐదేళ్లలో ఈ కంపెనీ రూ.4,788 కోట్ల ఎగుమతులు

అందులో రేషన్‌ బియ్యం ఎన్ని వందల కోట్లో?

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

అది ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన బియ్యం ఎగుమతి కంపెనీ. పేరంతా అక్కడే అయినా వ్యాపారం కాకినాడలోనే. ఇక్కడినుంచే ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న ఈ కంపెనీ, ఆ ముసుగులో రేషన్‌బియ్యాన్ని భారీగా సముద్రాలు దాటించేస్తోంది. రేషన్‌ బియ్యం లోడింగ్‌ చేస్తూ గత నెల్లో స్టెల్లా నౌకలో పట్టుబడ్డ బియ్యం అంతా ఈ కంపెనీదేనని తాజాగా నిర్ధారణ అయింది. దీంతో ఛత్తీ్‌సగఢ్‌ కంపెనీ సత్యం బాలాజీ.. బాగోతం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి, ఈ ఏడాది జూన్‌లో 6,332 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం ఆ కంపెనీ గోదాముల్లో అధికారులు సీజ్‌ చేశారు. కంపెనీ యజమాని ప్రదీప్‌ అగర్వాల్‌పై కేసు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. మళ్లీ ఐదు నెలలు దాటక ముందే నౌకలో రేషన్‌ బియ్యంతో దొరికిపోయింది. దీంతో అసలు ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో కాకినాడలో రేషన్‌ బియ్యం ఎలా చేతికి చిక్కుతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ కంపెనీ కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి గడచిన ఐదేళ్లలో రూ.4,788కోట్ల విలువైన 19లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో ఎన్ని వందల కోట్ల విలువైన రేషన్‌ బియ్యం ఉందోనన్న అనుమానాలున్నాయి.

దర్జాగా దొంగ వ్యాపారం...

వైసీపీ పాలనలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేలకోట్ల విలువైన రేషన్‌ బియ్యం తరలిపోయింది. ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో అనేకమంది బియ్యం ఎగుమతి ముసుగులో పేదల రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ల్లో ఆఫ్రికా దేశాలకు తరలించి వందలకోట్లు సంపాదించారు. ఈ బాగోతాన్ని కూటమి ప్రభుత్వం బట్టబయలు చేయడంతో ఇప్పుడు ఒక్కో తిమింగలం బయటకు వస్తోంది. అప్పట్లో అధికారం అండతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం, ఆయన అనుచరులు వేలకోట్ల విలువైన రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి ఎగుమతిచేసి కోట్లకు కోట్లు సంపాదించిన వైనం ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ద్వా రంపూడి సోదరుడైన వీరభద్రారెడ్డి... మానస కంపెనీ పేరుతోను, ఆయన అనుచరుడు వినోద్‌అగర్వాల్‌ సరళ ఫుడ్స్‌ పేరుతోను రూ.4,995 కోట్ల విలువైన 13.41లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేసినట్లు లెక్కలు తేలా యి. ఇందులో రేషన్‌ బియ్యం ఎన్ని వందల కోట్లు ఉంటుందోననే లెక్కలు ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ త్వరలో తేల్చనుంది. తాజాగా సత్యం బాలాజీ రైస్‌ కంపెనీ బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ధ్రువీకరించారు.


లక్షల టన్నుల బియ్యం ఎక్కడివి?

సత్యం బాలాజీ కంపెనీ గడచిన ఐదేళ్లలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది. ఇందులో 2019-2020లో 3లక్షల మెట్రిక్‌ టన్ను లు, 2020-2021లో 5లక్షల మెట్రిక్‌ టన్నులు, 2021-2022లో 4.10లక్షలు, 2022-2023లో 4లక్షలు, 2023-2024లో 4లక్షలు, 2024- 2025లో ఇప్పటివరకు 89వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసింది.

అవి రేషన్‌ బియ్యమే!

పలు సంస్థలపై క్రిమినల్‌ కేసులు

విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ (సీఎ్‌ఫఎస్‌) గోదాములో ఈ నెల తొమ్మిదో తేదీన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీల సందర్భంగా సీజ్‌ చేసిన బియ్యం రేషన్‌ డిపోల నుంచి సేకరించినవేనని స్పష్టమైంది. దీని పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో రెండు సంస్థలు, వాటి యాజమాన్యాలపై కేసు నమోదైంది. అప్పట్లో మంత్రి మనోహర్‌ 483 టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేయించారు. వాటిలో కొన్ని నమూనాలు తీసి, అవి రేషన్‌ బియ్యమా? కాదా? అనేది తెలుసుకునేందుకు పౌర సరఫరాల శాఖ....ప్రయోగశాలకు పంపించింది. అక్కడ పరీక్షలన్నీ నిర్వహించి, అవి రేషన్‌ బియ్యమేనంటూ నివేదిక ఇచ్చారు.

Updated Date - Dec 19 , 2024 | 05:35 AM