ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Student: గురుకులంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:34 AM

ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో పాపం.. డార్మిటరీలోని ఐటర్‌కాట్‌కు టవల్‌ను బిగించి ఉరేసుకుని చనిపోయాడు. అంతవరకు తమతో పాటే వంట పనుల్లో సాయం చేసిన ఆ చిన్నారి.. విగతజీవిగా మారిపోవడంతో సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్యారంపల్లెలో గురుకులంలో 5వ తరగతి చదువుతున్న తిరుపతి జిల్లాకు చెందిన రెడ్డిమోక్షిత్‌ మృతి కలకలం రేపింది.

విలపిస్తున్న తల్లి రెడ్డి వాణి, (ఇన్‌సెట్‌లో) రెడ్డి మోక్షిత్‌ మృతదేహం

పీలేరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం గ్యారంపల్లెలోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (బాలుర గురుకులం)లో 5వ తరగతి చదువుతున్న డి.రెడ్డిమోక్షిత్‌(10) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇతడు తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులోని దిగువవీధికి చెందిన డి.కృష్ణమూర్తి, డి.వాణి దంపతుల కుమారుడు. రోజులాగే ఆదివారం కూడా ఉదయాన్నే నిద్రలేచిన ఇతడు సహచర విద్యార్థులతో కలిసి కాసేపు పాఠశాల హాస్టల్‌లో వంట పనుల్లో సాయం అందించాడు. ఒక్కసారిగా డార్మిటరీలోకి వెళ్లి తన టవల్‌తో ఐరన్‌ కాట్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను గుర్తించిన ఇతర విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేశారు. వారు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఆస్పత్రిలో ఆ విద్యార్థి తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్‌ పీలేరు ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని రెడ్డి మోక్షిత్‌ కుటుంబీకులను ఓదార్చారు. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో సంఘటనపై సమగ్ర విచారణకు కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారని, విచారణలో తప్పు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారికి నచ్చజెప్పారు. అక్కడే ఉన్న గురుకులం ప్రిన్సిపాల్‌, ఇతర సిబ్బందిని డీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి విచారించారు. రెడ్డి మోక్షిత్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎ్‌సయూఐ, ఏఐఎ్‌సఎఫ్‌, డీబీఎ్‌సఎఫ్‌ విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజాసంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పీలేరు అర్బన్‌ సీఐ యుగంధర్‌ వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. డీఈవో సుబ్రహ్మణ్యం ఆదివారం సాయంత్రం గ్యారంపల్లెలోని గురుకులానికి చేరుకుని సంఘటనపై ఉపాధ్యాయులను విచారించారు. రెడ్డి మోక్షిత్‌ మృతి సంఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారని, పోస్టుమార్టం నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్డీవో స్పష్టం చేశారు.

Updated Date - Nov 11 , 2024 | 01:35 AM