Teachers: స్కూళ్లకు ఆలస్యంగా వచ్చే టీచర్లపై చర్యలు
ABN, Publish Date - Dec 11 , 2024 | 01:04 AM
‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే బడికి ఆలస్యంగా వెళితే పిల్లలకు ఏం క్రమశిక్షణ అలవాటు చేస్తారు? కాబట్టి ఎక్కడైనా టీచర్లు ఆలస్యంగా బడికి వెళ్లినట్లు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని డీఈవో వరలక్ష్మి చెప్పారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే బడికి ఆలస్యంగా వెళితే పిల్లలకు ఏం క్రమశిక్షణ అలవాటు చేస్తారు? కాబట్టి ఎక్కడైనా టీచర్లు ఆలస్యంగా బడికి వెళ్లినట్లు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని డీఈవో వరలక్ష్మి చెప్పారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల రోజుల్లో జిల్లా విద్యా వ్యవస్థలో గుర్తించిన లోపాలు, సరిచేయాల్సిన అంశాల గురించి మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడారు.విద్యాశాఖపరంగా ప్రజాప్రతినిధులను గౌరవిస్తున్నామని, గత నెలాఖరు వరకు ప్రజాప్రతినిధులు నా దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరించానన్నారు.ఈ నెలలో ఒక్క అంశం మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు.సర్దుబాటు సరిగా చేయకపోవడంతో జిల్లాలో అక్కడక్కడా టీచర్ల కొరత కనిపిస్తోందన్న ఆమె 311మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. త్వరలోనే సర్దుబాటు ప్రక్రియ మొదలెడతామన్నారు.తన పరిశీలనలో ప్రాథమిక పాఠశాలల్లో అభ్యసనా సామర్థ్యాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రణాళికాబద్ధంగా మెరుగుపరుస్తామన్నారు.బుధవారం నుంచి 19వ తేదీ వరకు జరిగే సమ్మెటివ్- 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు.వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించమని సబ్జెక్టు టీచర్లకు సూచించామన్నారు.స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గానే వున్నా నిర్వహణ లోపం కన్పిస్తోందన్నారు. వంటగదుల్లో శుభ్రత కరువైందని, దీన్ని సరిచేయడంపై దృష్టి సారించామన్నారు.
Updated Date - Dec 11 , 2024 | 01:04 AM